పవన్ ఆ ఒక్కమాట చెబితే మేం మళ్లీ ప్రశ్నించం!: పేర్ని నాని

  • చిరంజీవిని చూస్తే అలా ఉన్నాడు... చిన్నోడిని చూస్తే ఇలా ఉన్నాడనేది మా బాధ అన్న పేర్ని నాని
  • పవన్ తెరపై హీరోగా ఉన్నాడు.. అలాగే కొనసాగితే మంచిదని హితవు
  • బాలకృష్ణ మీ అభిమానులను ఏమన్నాడో అందరికీ తెలుసునని వ్యాఖ్య
రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసిన అనంతరం పొత్తు ప్రకటన చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చిరంజీవిని చూస్తే అలా ఉన్నాడు... కానీ చిన్నోడిని (పవన్ కల్యాణ్‌ను ఉద్ధేశించి) చూస్తే ఇలా అయ్యాడనే బాధ తమకూ ఉందన్నారు. జనసేనాని తెరమీద హీరోగా ఉన్నాడని, అలాగే కొనసాగితే మంచిదని, రాజకీయాల్లోకి వచ్చి జోకర్ వేషాలు వేయడం ఎందుకని ప్రశ్నించారు. పవన్ తెరపై హీరో అయితే రాజకీయాల్లో జోకర్ అన్నారు.

మీ అమ్మగారిని, కుటుంబ సభ్యులను తిట్టిన టీడీపీతో ఎలా కలిశావో చెప్పాలన్నారు. నువ్వైతే క్షమించావ్ అనుకుంటే, జెండా మోసిన మీ అభిమానులు, కేడర్ పరిస్థితి ఏమిటి? అన్నారు. వారిని బాలకృష్ణ ఏమన్నాడో అందరికీ తెలుసు అన్నారు. 

తాను చంద్రబాబు కోసమే పార్టీ పెట్టానని పవన్ కల్యాణ్ చెబితే తాము అతనిని మరోసారి ప్రశ్నించమని స్పష్టం చేశారు. కానీ ఆయన దొంగమాటలు చెబుతున్నాడన్నారు. రాజకీయ పార్టీలను ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉందని, అలాగే తనకూ ఉందన్నారు. తాను చంద్రబాబు కోసం పార్టీ పెట్టానని, ఆయన కోసమే పని చేస్తున్నానని పవన్ ఒక్కమాట చెబితే తాము మళ్లీ ప్రశ్నించమని, అలా చెప్పాక కూడా అడిగితే తమపైకి ఒక చెప్పు కాదు.. పది చెప్పులు తియ్ అన్నారు.

Perni Nani
Pawan Kalyan
Chandrababu
Janasena

More Telugu News